కుల గణన సర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వేను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సర్వేలో సేకరించిన వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని నిర్ణయించింది. ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ సర్వేలో సేకరించిన డేటాను ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.