తెలంగాణలో ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లబ్ధిదారుల వివరాలు నమోరు చేసేందుకు బిల్డ్ నౌ యాప్ ను తీసుకొచ్చింది. దీనిని మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది.