కోదాడ ఆర్డీఓ సిహెచ్ సూర్యనారాయణ దీపావళి సందర్భంగా కోదాడ ప్రజలకు గురువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరజిల్లాలని ఆకాంక్షించారు.