విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో మృతిచెందాడు. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన వైద్యుల ప్రకాష్(50) సూర్యాపేట డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకొని తన బైక్‌పై వల్లాలకు వెళ్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి తన కుమారుడికి ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.