నల్గొండ మున్సిపాలిటీ 3వ వార్డు కేశరాజుపల్లి (పాతపల్లె) లో విషాదం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న యన్నమల్ల సైదులు (34) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత 10 రోజుల క్రితం నల్గొండలో పెరుమాళ్ళ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. డాక్టర్ల సలహాతో హైదరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10గం. కు మృతి చెందాడు.