నల్గొండ: ట్రాక్టర్ టైర్ కింద పడి వ్యక్తి మృతి

58చూసినవారు
నల్గొండ: ట్రాక్టర్ టైర్ కింద పడి వ్యక్తి మృతి
బోయినపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కడారి వెంకన్న యాదవ్ సోమవారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు టైర్ కింద పడి దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ లో ఇసుక లోడ్ చేసుకుని నల్గొండకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ డోరు లూజు కాగా దానిని సరిచేసి ట్రాక్టరు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతున్న క్రమంలో కాలుజారి టైరు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్