సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ నగర్ విజయాంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం రామ మూల మంత్ర హోమాన్ని ఘనంగా నిర్వహించగా వందలాది మంది భక్తులు శ్రీరామ తారక జపయజ్ఞంలో పరవశించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షులు మండల్ రేడ్డి వెంకట్ రేడ్డిలు మాట్లాడుతూ కార్తీకమాసాన్ని పురస్కరించుకొని రామనామ జపం లక్షసార్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రెండు లక్షలు దాటినట్లు తెలిపారు.