eSIM పూర్తి పేరు ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది వర్చువల్ సిమ్ కార్డ్. ఇది ఫోన్‌లోనే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లే కాకుండా, స్మార్ట్‌వాచ్‌లు టాబ్లెట్‌లు, ఇతర ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన పరికరాలలో కూడా eSIM సాంకేతికత ఉపయోగించవచ్చు. ఫిజికల్ సిమ్‌లా కాకుండా, ఫోన్ నుంచి దీన్ని తీసివేయడం సాధ్యం కాదు. ఇది దొంగతనం విషయంలో ట్రాకింగ్ సులభతరం చేస్తుంది.