షాద్‌నగర్‌: డివైడర్ ను ఢీకొన్న బైక్... వ్యక్తి మృతి

81చూసినవారు
షాద్‌నగర్‌: డివైడర్ ను ఢీకొన్న బైక్... వ్యక్తి మృతి
షాద్‌నగర్‌ పట్టణంలోని పరిగి రోడ్డులో బైక్‌ డివైడర్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం. చౌదరిగూడ మండలం తూంపల్లికి చెందిన గట్టుపల్లి యాదయ్య(40) బుధవారం బైక్‌పై షాద్‌నగర్‌కు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా, పరిగి రోడ్డులో డివైడర్‌ను ఢీకొన్నాడు. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్