మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో సోమవారం విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట పట్టారు. వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు రైతులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతాలలో తరచూ విద్యుత్ ప్రమాదాలు జరిగి అన్నదాతలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విద్యుత్ ప్రమాదాలను నివారణే ధ్యేయంగా. విద్యుత్ డి. ఇ తమ సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు.