తాడ్వాయి :మేడారంలో భక్తుల రద్దీ

71చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను ఆదివారం భక్తులు దర్శించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చారు. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో అమ్మవార్లకు కుటుంబసభ్యులతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఫిబ్రవరి 12 నుండి 15 వరకు నాలుగు రోజులపాటు మేడారం మినీ జాతర జరుగనున్న నేపథ్యంలో భక్తులు ముందస్తు గా దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్