జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామ శివారులోని ఇటుక బట్టీల దగ్గర బుధవారం TS 24C5499 నెంబర్ గల వాహనం ప్రమాదవషత్తు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.