కొండ వర్సెస్ రేవూరి
వరంగల్ జాన్ పాక దగ్గర దసరా కొసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో మాత్రమే పెట్టి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ఫోటో పెట్టకపోవడంతో ఆదివారం గొడవ జరిగింది. ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని, ఫ్లెక్సీని చించివేశారు. దీంతో కోపోద్రిక్తులైన మంత్రికి చెందిన కార్యకర్తలు, ఫ్లెక్సీ ని చించివేసిన పిట్టల అనిల్ పై దాడిచేసారు. కొండా వర్గీయులను అదుపులోకి తీసుకోవడంతో ధర్మారం వద్ద రెండు గంటలపాటు ధర్నా చేశారు.