మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

53చూసినవారు
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలహాలం నెలకొంది. భక్తులు ఆలయానికి చేరుకొని ఆ స్వామి వారికి ఓగ్గు పూజారులచే ఆలయ ప్రాంగణంలో పట్నాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్