వరంగల్: కూరగాయల మార్కెట్ ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతా మంత్రి
వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ, సంబంధిత శాఖల అధికారు లతో కలసి కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్లను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు.