హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి. సాంబ రెడ్డి తెలిపారు. టీచర్స్ కాలనీ, బ్యాంక్ కాలనీ, చైతన్యపురి కాలనీ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, కాజిపేటలోని విష్ణుపురి వాటర్ ట్యాంక్, సోమిడి రోడ్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు.