తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. ఈ నెల 26 నుంచి 4 పథకాలు మొదలుకానున్నాయని, లబ్ధిదారులను గ్రామసభల్లో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఖమ్మం (D) ఎర్రుపాలెంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు.