ఈ నెల నుంచే స్కూల్ హాస్టల్‌లలో పర్యటిస్తాం: భట్టి

64చూసినవారు
ఈ నెల నుంచే స్కూల్ హాస్టల్‌లలో పర్యటిస్తాం: భట్టి
తెలంగాణలో నెలలో ఒక రోజు స్కూల్ హాస్టల్‌లకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ తో పాటు సభ్యులందరూ వెళ్తారని చెప్పారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ‘హాస్టళ్లలో పర్యటించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాం. వసతి గృహాల్లో వసతులు మెరుగుపరుస్తాం. ఇందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయించాం. గత పదేళ్లలో డైట్‌ ఛార్జీలు పెంచలేదు. మా ప్రభుత్వం రాగానే డైట్‌ ఛార్జీలు పెంచాం’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్