శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని, ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అధికారి వినోద్ గోపి అన్నారు. ఆయన సోమవారం డీసీపీ రాజేష్ చంద్ర, ఎసీపీ రమేష్, సీఐ కొండల్ రావుల ఆదేశాలతో మోటకొండూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి గ్రామ పంచాయతీ వరకు సీఆర్పీఎఫ్, రాపిడ్ ఆక్షన్ పోర్స్ తో కవాతు నిర్వహించారు.