కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా సోమవారం భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, గ్యాస్ చిన్న, పిట్టల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.