యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్నికి హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ యువ నాయకులు, సామాజిక సేవకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆమె సూచించారు.