

నల్గొండ: అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి
నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డులో గురువారం సాయంత్రం 4: 00 గంటల సమయంలో మారుతి బ్రెజా కారు డ్రైవర్ ఫోన్లో మాట్లాడుకుంటూ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో గల డివైడర్ ను వేగంగా ఢీ కొట్టింది. కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.