
నిర్మల్: గ్రామీణ మహిళలు జాతీయస్థాయి వ్యాపార వేత్తలుగా ఎదగాలి
గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలు జాతీయ స్థాయి వ్యాపార వెత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన మద్దతు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సహాయ మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత, హస్తకళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన 'మిని సరస్ ఫెయిర్ 2025' ఆమె ప్రారంభించారు.