Biggest Flop Movie: రూ.45 కోట్లతో సినిమా తీస్తే.. వచ్చింది రూ.50 వేలు
ఫ్లాప్ మూవీ అంటే బాక్సాఫీస్ దగ్గర పెట్టిన బడ్జెట్ కంటే తక్కువ వసూళ్లు సాధించే మూవీని అంటారు. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ మరొకటి ఉండదేమో. ‘ది లేడీ కిల్లర్’ సినిమాను రూ.45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. కానీ దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 12 షోలు మాత్రమే ఆడాయి. మొత్తంగా రూ.45 వేలు మాత్రమే వసూలయ్యాయి. తొలి రోజు 293 టికెట్లు అమ్ముడుపోయాయంటే ఈ సినిమా దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.