కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. కానిస్టేబుల్ అభ్యర్థులకు గతేడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. గతంలో 91,507 మంది అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దరఖాస్తుకు మరోసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అవకాశం ఇచ్చింది. ఈనెల 11 నుంచి 21 వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.