విజయవాడలో నడిరోడ్డుపై తగలబడ్డ అంబులెన్స్

AP: విజయవాడలో నడిరోడ్డుపై అంబులెన్స్ తగలబడింది. రమేష్ హాస్పిటల్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. పేషేంట్‌ను దింపి తిరిగివస్తున్న అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలు ఎక్కువ అయ్యేసరికి డ్రైవర్ బయిటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తగలబడుతున్న అంబులెన్స్ వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించేలోపే వాహనం పూర్తిగా తగలబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్