టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు. బాబు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది. ఏయే శాఖలు ఎవరికి దక్కుతాయనే దాని మీద చర్చ సాగుతోంది. అయితే నారా లోకేష్‌కి హోం శాఖ ఇవ్వాలన్న డిమాండ్ టీడీపీ కార్యకర్తల నుంచి వస్తోంది. ఆయన కూడా హోం మంత్రిత్వ శాఖ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.