ఈ నెల 23వ తేదీన కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.