తమిళనాడులో హిందీ భాష గురించి బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష వల్ల ఉత్తర భారతదేశంలో 25 భాషలు కనుమరుగయ్యాయని, హిందీ ఆధిపత్యం కారణంగా అనేక ప్రాచీన భాషలు మరణిస్తున్నాయని అన్నారు. జాతిని నాశనం చేయడానికే భాషపై దాడి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.