ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విషాద ఘటన వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి అప్పటివరకు గెంతులేసింది.. బోసినవ్వులతో రోడ్డుపై నడుస్తూ వెళ్లి సందడి చేసింది. విధి వక్రీకరించిందేమో.. నీటిని చూడాలనే కుతూహలంతో చిన్నారి పరిగెత్తుకుంటూ నీటి కుంటలోకి వెళ్లి అందులో పడిపోయింది. ఇది గమనించిన ఓ వ్యక్తి పరిగెత్తుకొచ్చి ఆమెను బయటకు తీశాడు. ఇంతలో ఈ వీడియో ముగుస్తుంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.