తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన నిర్ణయాల కోసం హైకమాండ్ ఎంతగా మల్లగుల్లాలు పడుతోంది గత కొన్ని నెలలుగా చూస్తున్నాం. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొత్త తలనొప్పి తప్పదనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరిని ఎంపిక చేయబోతోంది. గాంధీభవన్‌కు కొత్త బాస్ ఎవరు కానున్నారు? సీనియర్ల అభ్యంతరాలు-గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఆ నియామకాన్ని కాంగ్రెస్ ఎలా పూర్తి చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.