బెంగళూరు రేవ్‌పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్‌ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్‌పార్టీ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర పోషించారని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధ్రువీకరించారు. నటి హేమ సహా ఎనిమిది మందికి 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.