AP: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాపులపాడు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి.. వెనుక నుంచి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.