రజకులకు రజక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని టిఆర్విఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మహాసభ కు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ హాజరై మాట్లాడుతూ హైడ్రా పేరుతో ధోబి గాట్లను కూల్చరాదని, అర్హులైన రజకులకు ప్రభుత్వం డబల్ బెడ్ రూములు ఇల్లను మంజూరు చేయాలని అన్నారు. మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.