నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ సోమవారంతో ముగియనుంది. ఆదివారం సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఆదివారం రికార్డు స్తాయిలో 90 వేల మందికి పైగా వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. జనవరి 3వ తేదీ నుండి ప్రారంభమైన ఎగ్జిబిషన్ లో వందల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రూ. 50 ఎంట్రీ ఫీజు ఉంది. 5 ఎల్లలోపు పిల్లలకు ఉచితం. నగరవాసులు చివరి రోజు పోటెత్తే అవకాశం ఉండడంతో తాగు ఏర్పాట్లు చేశారు.