జొన్నగిరి బంగారు గని మన దేశంలో ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని. దీని కోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.