తెలంగాణ బడ్జెట్ సమావేశాల వేళ మాజీ సీఎం KCR ప్రజలకు షాకిచ్చారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన KCR.. గవర్నర్ ప్రసంగించిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కీలకమైన BAC సమావేశానికి హాజరు కావాల్సిన KCR, సమావేశానికి హాజరు కాకుండానే వెళ్లిపోయారు. BAC సమావేశానికి KCR డుమ్మా కొట్టడంతో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా, BRS అధికారం కోల్పోయాక KCR కేవలం మూడే సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు.