AP: ‘జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో పురోగతి, శ్రేయస్సును నడిపించడంలో వారి పాత్ర నిస్సందేహంగా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.