కాసిపేట: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

కాసిపేట మండలంలోని పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అంజలి, ఓదెలు, ప్రవీణ్, శారద, భాగ్యమ్మలకు మొత్తం ఒక లక్ష ఇరవై నాలుగు వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం పొందిన వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రదీప్ కోరారు.

సంబంధిత పోస్ట్