ఫోన్ మాట్లాడుతూ పసికందును ఆటోలోనే వదిలేసిన తల్లి (వీడియో)

మహారాష్ట్రలో ఒక మహిళ ఫోన్ కాల్‌లో బిజీగా ఉండటంతో తన పసికందును ఆటోరిక్షాలోనే వదిలేసింది. అది గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే బిడ్డను తీసుకువెళ్లి ఆ మహిళకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో 'తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గరే బిడ్డ సురక్షితంగా ఉంటుందని గుడ్డిగా నమ్మే న్యాయమూర్తులకు ఈ వీడియో చూపించాలి' అని కస్టడీ కేసుల్లో పోరాడుతున్న తండ్రులు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్