AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. కాగా, ఆర్వోపై దురుసుగా ప్రవర్తించిన కేసులో చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఎస్సై చౌడయ్య బుధవారం నోటీసులిచ్చారు. విచారణకు వచ్చి సహకరించాలని అందులో పేర్కొన్నారు.