బజాజ్ ఆటో పల్సర్ NS సిరీస్ యొక్క 2024 సంవత్సర కొత్త మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. పల్సర్ NS 200 ధర రూ.1,57,427, పల్సర్ NS160 ధర రూ.1,45,792, పల్సర్ NS125 ధర రూ.1,04,922 (ఎక్స్-షోరూమ్ ఢిల్లి)గా నిర్ణయించారు. ఈ బైకులు మూడు రంగుల్లో లభిస్తాయి. బ్లూటూత్ అనుసంధానిత రివర్స్ మోనోక్రోమేటిక్ ఎల్సీడీ కన్సోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నేవిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.