ప్రపంచ టెన్నిస్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలిన రోజర్ ఫెదరర్ ఆటే కాదు జీవితమూ స్ఫూర్తిదాయకమే. తన సొగసైన ఆటతో దిగ్గజంగా పేరొందిన ఫెదరర్ మళ్లీ అభిమానుల ముందుకు వచ్చాడు. అవును.. రెండేండ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన ఫెదరర్‌పై అమెజాన్ ప్రైమ్ రూపొందించిన ‘ఫెదరర్ ట్వల్ ఫైనల్ డేస్' డాక్యుమెంటరీ విడుదలైంది. ఈ సందర్భంగా లండన్ టవర్ బ్రిడ్జిపై ఈ లెజెండరీ ఆటగాడి డాక్యుమెంటరీని ఆవిష్కరించారు.