AP: మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకున్నది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయం కట్టారని మున్సిపల్ అధికారులు జేసీబీలతో అక్కడికి చేరుకున్నారు. ఆక్రమణలో ఉందని పేర్కొంటూ వైసీపీ కార్యాలయం ర్యాంపును తొలగించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి పేర్ని నానిని అడ్డుకున్నారు. కాగా, బుధవారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.