అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 34 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రజా సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించ వలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వచ్చిన 34 ఫిర్యాదులలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు మరియు చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయని అన్నారు.