ప్రముఖ పుణ్యక్షేత్రమైన హుకుంపేట మండలంలోని మఠం పంచాయతీలో ఉన్న శ్రీశ్రీశ్రీ మత్స్యశ్వరలింగేశ్వరస్వామి వారిని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కలెక్టర్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు కలెక్టర్ చే ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించారు. అనంతరం కలెక్టర్ కి ఆలయం కమిటి సన్మానం చేసి ఆలయ చరిత్రను వివరించారు.