గంజాయి జోలికెళ్ళి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని దారేల సర్పంచ్ పాండురంగ స్వామి కోరారు. బుధవారం ముంచంగిపుట్టు మండలంలోని పెద్దపెటలో గంజాయి పంట నిర్మూలనపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి జోలికి ఎవరు వెళ్ళొద్దని, గంజాయి పంట పండించినా, సరఫరా చేసినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి రవాణా చేస్తే భవిష్యత్ నాశనం అవుతుందని వారి కుటుంబాలు జైల్లో ఉండే పరిస్థితి చూస్తున్నామన్నారు.