పద్మనాభం మండలం బాందేవపురంలో 57 సెంట్లు భూమి వివాదంలో ఉందని ఎమ్మార్వోకి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మార్వో ఆనందరావు వివాదంలో ఉన్న భూమిని పరిశీలించారు. కాగా దెందేటి అప్పన్న అనే వ్యక్తి ఈ భూమి తనదే అని ఎమ్మార్వోకి తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను మంగళవారం సమర్పించాడు. ఈ విషయంపై ఎమ్మార్వోని వివరణ అడగగా సమగ్ర సర్వే నిర్వహించి భూమి వాస్తవ స్థితిని తెలియజేస్తామని చెప్పారు.