గాంధీ జయంతి సందర్భంగా బుధవారం చోడవరం కోర్టు అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. సూర్యకళ చోడవరం సబ్ జైలును సందర్శించి ముద్దాయిలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి మిఠాయిలు పళ్ళు అందజేసే సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్రేకానికి పోకూడదని మంచిగా ఉండాలని చెప్పారు.