నాతవరం ఏపీ. పురంలో శుక్రవారం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. తహశీల్దార్ ఎ. వేణుగోపాల్ రైతులకు సంబంధించిన సమస్యలపై అర్జీలు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. తహశీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూసమస్యలు పరిష్కారమౌతాయని చెప్పారు. కావున రైతులు ఈ సదస్సులో తమ సమస్యలను అర్జీలు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైల రమేశ్ నాయుడు పాల్గొన్నారు.